లగచర్ల నేతలు త్వరలో సీఎంను కలుస్తరు..కాంగ్రెస్ ప్రతినిధుల బృందం వెల్లడి

హైదరాబాద్, వెలుగు : లగచర్ల దాడి వెనక బీఆర్ఎస్​ హస్తం ఉందని కాంగ్రెస్ నిజ నిర్ధారణ​ ప్రతినిధుల బృందం తెలిపింది. శుక్రవారం బృందం సభ్యులు ఎంపీ మల్లు రవి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్​ చైర్మన్​ కోదండ రెడ్డి సెక్రటేరియేట్​లో మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నరేంద ర్ రెడ్డి, సురేశ్, బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికా ప్రకారమే అధికారులపై దాడి చేశారని తెలిపారు.

దాడిచేసిన వారిలో  17 మందికి అసలు భూమే లేదని చెప్పారు. త్వరలోనే సీఎంని కలుస్తామని లగచర్ల మాజీ సర్పంచు లు, ఇతర నాయకులు చెప్పినట్లు వివరించారు. ఘటనపై రిపోర్టును సీఎంకు, ప్రతిపక్ష పార్టీల నాయకుల కు ఇస్తామన్నారు.కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వా న్ని అస్థిరపరిచే కుట్ర చేశారని మండిపడ్డారు.  రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.